Lalit Modi Return | ఫెమా కేసులో ఊరట.. 16 ఏళ్ల తర్వాత భారత్‌కు లలిత్ మోదీ

ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ 16 సంవత్సరాల తర్వాత మళ్లీ స్వదేశానికి రానున్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Lalit Modi Return | ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ 16 సంవత్సరాల తర్వాత మళ్లీ స్వదేశానికి రానున్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌కు వస్తానని ఆయన తెలిపారు. 2009 నాటి ఐపీఎల్ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) కేసులో అప్పిలేట్ ట్రైబ్యూనల్ ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో లలిత్ మోదీ ఒక వీడియో విడుదల చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు.

Lalit Modi Return | ముగిసిన సుదీర్ఘ పోరాటం..

గత 16 సంవత్సరాలుగా తాను న్యాయపోరాటం చేస్తున్నానని, చివరికి తాను చెప్పిందే నిజమని తేలిందని లలిత్ మోదీ పేర్కొన్నారు. ఐపీఎల్‌ను విజయవంతం చేయడమే తన ధ్యేయమని, ఇప్పుడు ఆ వివాదాల అధ్యాయం ముగిసిందని చెప్పారు. అక్టోబర్‌లో తన కూతురు బిడ్డకు జన్మనివ్వనుందని, అంతా సవ్యంగా జరిగితే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో భారత్‌కు వస్తానని వెల్లడించారు. ఫెమా కేసు నమోదు కావడంతో ఆయన 2010 నుంచి విదేశాల్లోనే ఉంటున్నారు.

Lalit Modi Return | అసలేంటి ఈ ఫెమా కేసు?

2009లో దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఈ టోర్నీ నిర్వహణ నిధుల బదిలీలో ఆర్‌బీఐ అనుమతులు తీసుకోలేదని, విదేశీ మారక నిబంధనలు ఉల్లంఘించారంటూ లలిత్ మోదీతో పాటు మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేసులు నమోదు చేసింది. అంతేకాకుండా లలిత్ మోదీకి రూ.10.65 కోట్ల జరిమానా విధించింది. ఈ సుదీర్ఘ కేసుపై తాజాగా విచారణ జరిపిన అప్పిలేట్ ట్రైబ్యూనల్.. ఆయనకు ఊరటనిస్తూ తీర్పు వెలువరించింది.

ఇది కూడా చదవండి:  REDCO DE | రెడ్కో డీఈ నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భార్య పేరిట భారీగా ఆస్తులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *