Nashik Earthquake | మహారాష్ట్రలో భూకంపం.. గోడలకు పగుళ్లు

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nashik Earthquake | మహారాష్ట్ర (Maharashtra)లో భూకంపం వచ్చింది. నాసిక్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనల తర్వాత ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం శనివారం రాత్రి 10:00 గంటలకు నాసిక్‌లో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత ఆదివారం ఉదయం 5:33 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.3 తీవ్రతతో మరో ప్రకంపన నమోదైంది. మహారాష్ట్ర-గుజరాత్ సరిహద్దుకు సమీపంలో ఉన్న హట్‌గడ్ పర్వత శ్రేణిలోని బన్వత్ ప్రాంతంలో, భూమికి 5 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనల కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Nashik Earthquake | పరుగులు తీసిన ప్రజలు

నాసిక్ నగరంతో పాటు సుర్గాన, కల్వాన్, డియోలా, చాంద్‌వాడ్, పెత్, దిండోరి మరియు నిఫాద్ తాలూకాలలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు రావడంతో, భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భదర్, ననాషి గ్రామాల్లో ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడినట్లు జిల్లా యంత్రాంగం అధికారులు తెలిపారు. ఈ జిల్లాలో గతంలో జూలై 25, 28 మధ్య, ఆగస్టు 6న కూడా భూ ప్రకంపనలు నమోదు అయ్యాయి.

దీనిని కూడా చదవండి : Lal Darwaza Bonalu | ఘనంగా లాల్​దర్వాజ బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న విజయ్​ దేవరకొండ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *