అక్షరటుడే వెబ్‌డెస్క్: Air India Pilot Dope Test | థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తుండగా తీవ్ర గాలి తుఫాను (టర్భ్యులెన్స్) కారణంగా ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ విమానానికి చెందిన పైలట్-ఇన్-కమాండ్ డోప్ టెస్ట్‌లో విఫలమైనట్లు సమాచారం. విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో, ఆ పైలట్ మత్తు పదార్థాలు (సైకోయాక్టివ్ సబ్‌స్టాన్సెస్) వాడినట్లు తేలినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఇది తుది నిర్ధారణ కాదని, రెండో విడత పరీక్షల ఫలితాలు వస్తేనే స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి విచారణ జరిగే వరకు ఆ ఇద్దరు పైలట్లను విధులకు దూరంగా ఉంచినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి స్పష్టం చేశారు.
Air India Pilot Dope Test | నిబంధనలు..
ఆగస్టు 4న 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో బయలుదేరిన ‘AI2379’ విమానం ఆకాశంలో అకస్మాత్తుగా తీవ్ర ఎత్తును కోల్పోవడంతో సుమారు ఐదు నిమిషాల పాటు భయానక వాతావరణం నెలకొంది. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడగా.. ఇద్దరు సిబ్బందికి వెన్నెముక తీవ్ర గాయాలయ్యాయి.
విమానయాన నిబంధనల ప్రకారం.. తొలిసారి డ్రగ్స్ వాడినట్లు రుజువైతే సంబంధిత పైలట్‌ను పునరావాస కేంద్రానికి పంపిస్తారు. ఒకవేళ రెండోసారి కూడా దొరికితే వారి లైసెన్స్‌ను మూడేళ్ల పాటు రద్దు చేస్తారు. ప్రస్తుతం ఈ ఘటనపై పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) సమగ్ర దర్యాప్తు జరుపుతోంది.
ఎయిర్ ఇండియా పైలట్‌కు డోప్ టెస్ట్‌లో పాజిటివ్?
ఆగస్టు 4న తీవ్ర టర్బులెన్స్ ఎదుర్కొన్న
ఎయిర్ ఇండియా ఫుకెట్–ఢిల్లీ విమాన ఘటనకు సంబంధించి ఎంక్వైరీ కొనసాగుతోంది.
ఈ క్రమంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం.
విమాన కెప్టెన్‌కు చేసిన డోప్ టెస్ట్‌లో పాజిటివ్‌గా… pic.twitter.com/U71xqRdPUM— Ravi Prakash Official (@raviprakash_rtv) August 9, 2026
ఇది కూడా చదవండి: Nashik Earthquake | మహారాష్ట్రలో భూకంపం.. గోడలకు పగుళ్లు