అక్షరటుడే వెబ్డెస్క్: Sugar Blood Pressure | సాధారణంగా అధిక రక్తపోటు (High BP) సమస్య ఉన్నవారు ఉప్పును తగ్గించుకోవాలని అందరూ చెబుతుంటారు. అయితే, ఉప్పు మాత్రమే కాకుండా మనం తినే ఆహారంలో ఉండే చక్కెర కూడా రక్తపోటును ప్రమాదకర స్థాయిలో పెంచుతుందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. 2014 , 2020లో జరిగిన పలు మెటా-ఎనాలిసిస్ అధ్యయనాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.
Sugar Blood Pressure | చక్కెర ఎలా ప్రభావం చూపుతుంది?
మనం తీసుకునే సోడాలు, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూస్లు, స్వీట్లు , మైదాతో చేసిన రిఫైన్డ్ ఆహార పదార్థాల్లో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో చేరినప్పుడు ప్యాంక్రియాస్ నుంచి అదనపు ఇన్సులిన్ విడుదలయ్యేలా చేస్తాయి. దీనివల్ల కాలక్రమేణా ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ ఏర్పడి, మూత్రపిండాలు శరీరంలోని నీటిని, ఉప్పును బయటకు పంపకుండా లోపలే నిల్వ చేస్తాయి. తద్వారా రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి బీపీ పెరుగుతుంది.
Sugar Blood Pressure | పెరుగుతున్న ముప్పు..
పరిశోధనల ప్రకారం, అధికంగా చక్కెర కలిగిన పానీయాలను తాగే అలవాటు ఉన్నవారిలో హైపర్టెన్షన్ వచ్చే ప్రమాదం సుమారు 26 శాతం వరకు పెరుగుతుందని తేలింది. సోడాలు, స్వీటెన్డ్ కాఫీలు, కేకులు, బిస్కెట్ల వంటివి నాడీ వ్యవస్థను అతిగా ప్రేరేపించి రక్తపోటును నియంత్రణ తప్పేలా చేస్తాయి. ఇది దీర్ఘకాలంలో గుండె సమస్యలు, కిడ్నీ వ్యాధులకు దారితీయవచ్చు.
Sugar Blood Pressure |నిపుణుల సూచనలు..
రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలంటే చక్కెర , రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం మంచిది. ముఖ్యంగా బయట దొరికే ప్రాసెస్డ్ ఫుడ్స్, ఐస్క్రీమ్లు, మైదా పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటి స్థానంలో సహజమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Oil Palm Cultivation | ఆయిల్ పామ్ సాగు చేసే గ్రామాలకు ప్రోత్సాహకం