Harish Rao Farmhouse | అంత భయమెందుకు? దమ్ముంటే నా ఇంటికి రండి.. భోజనం పెట్టి తోట చూపిస్తా: హరీష్‌రావు

రంగనాయక సాగర్ సమీపంలోని తన ఫామ్‌హౌస్‌పై కాంగ్రెస్ నాయకుల పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao Farmhouse | రంగనాయక సాగర్ సమీపంలోని తన ఫామ్‌హౌస్‌పై కాంగ్రెస్ నాయకుల పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన బైండ్ల కులాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు.

Harish Rao Farmhouse | నా జీవితం తెరిచిన పుస్తకం..

తన జీవితం పూర్తిగా తెరిచిన పుస్తకం లాంటిదని హరీష్‌రావు స్పష్టం చేశారు. 2018, 2023 ఎన్నికల అఫిడవిట్లలోనే తన ఆస్తుల వివరాలన్నింటినీ స్పష్టంగా వెల్లడించానని, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా బయటపెట్టింది ఏమీ లేదని తేల్చిచెప్పారు. రామంచలో తాము 13 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఇతరుల మాదిరిగా తాము ఎప్పుడూ కబ్జాలు చేయలేదని, ప్రజలను దోచుకోలేదని స్పష్టం చేశారు. సిద్దిపేట ప్రజలు తమ పనితీరును చూసే ఏడు సార్లు గెలిపించారని, సిద్దిపేట అంటేనే ప్రేమ, ఆత్మీయత, ఆతిథ్యానికి మారుపేరని కొనియాడారు.

Harish Rao Farmhouse |ఆసక్తికర ఆహ్వానం..

ఫామ్‌హౌస్ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ నాయకుల తీరుపై హరీష్‌రావు సెటైర్లు వేశారు. తమ ఇంటికి వచ్చేందుకు 3,000 మంది పోలీసులు, బుల్లెట్ ప్రూఫ్ బండ్లు, భారీ పోలీస్ పహారా ఎందుకంటూ ప్రశ్నించారు. అంత భయపడాల్సిన అవసరం లేదని, దమ్ముంటే నేరుగా తన ఇంటికి రావాలని ఆహ్వానించారు. అలా వస్తే స్వయంగా భోజనం పెట్టి, దగ్గరుండి తన తోటను చూపిస్తానని ఎద్దేవా చేశారు. సిద్దిపేట అంటేనే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అని హరీష్‌రావు ఉద్ఘాటించారు.

 

ఇది కూడా చదవండి:  Air India Express Pilots | నలుగురు పైలెట్లను సస్పెండ్​ చేసిన ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *