Nepal Flash Floods | నేపాల్‌లో భీకర వరదలకు భూకంపం కారణం కాదు..అమెరికా సంచలన ప్రకటన

హిమాలయ దేశం నేపాల్‌లో సంభవించిన మెరుపు వరదలు వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Nepal Flash Floods | హిమాలయ దేశం నేపాల్‌లో సంభవించిన మెరుపు వరదలు వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. భోటే కోషి నది ఉప్పొంగడంతో అనేక జిల్లాలు వరద, బురదమయమయ్యాయి. ఈ విపత్తుకు మంచుకొండల్లో భూకంపమే కారణమని తొలుత వార్తలు రాగా, తాజాగా అమెరికా  జియాలాజికల్‌ సర్వే ( USGS ) అసలు నిజం బయటపెట్టింది.

Nepal Flash Floods | పర్వతాలపై నీటి బాంబులు..

టిబెట్‌లోని గోసాయిన్‌కుండ ప్రాంతంలో సంభవించిన ప్రకంపనలను తొలుత భూకంపంగా అంచనా వేశారు. అయితే దీన్ని పరిశీలించిన అమెరికా జియాలాజికల్‌ సర్వే, అది భూకంపం కాదని స్పష్టం చేసింది. హిమనీ సరస్సు బద్ధలవడం వల్ల భారీ మంచు చరియలు, రాళ్లు పడ్డాయని వెల్లడించింది. దీంతో లిండే నది ఉప్పొంగి, బోటే కోషి నదిలోకి ఒక్కసారిగా వరద దూసుకొచ్చిందని శాటిలైట్ దృశ్యాల ద్వారా తేల్చారు. మరోవైపు, జల ప్రళయానికి దాదాపు 7 నిమిషాల ముందు భూ ప్రకంపనలు వచ్చినట్లు జర్మన్‌ రీసర్చ్‌ సెంటర్‌ తెలిపింది.

Nepal Flash Floods | భారీ ప్రాణనష్టం..

ఈ భీకర వరదల కారణంగా ఇప్పటివరకు 157 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గల్లంతు కాగా, వీరిలో భారత్‌ నుంచి 140 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. అలాగే టిబెట్ వైపు కూడా వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముగ్గురు మరణించగా, 553 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి:  Mir Alam Lake Tourism | మీర్​ ఆలం చెరువును పర్యాటక కేంద్రంగా మార్చాలి : సీఎం రేవంత్​రెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *