Oil Palm Cultivation | ఆయిల్ పామ్​ సాగు చేసే గ్రామాలకు ప్రోత్సాహకం

ఆయిల్ పామ్​ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రులు వివేక్​, పొన్నం ప్రభాకర్​ తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Oil Palm Cultivation | సుస్థిర, అధిక ఆదాయాన్నిచ్చే వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ సాగును 50 వేల ఎకరాలకు విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek) తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 14,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని పేర్కొన్న ఆయన, రైతులు అధిక లాభదాయకమైన పంటల వైపు మళ్లాలని సూచించారు.

హుస్నాబాద్ (Husnabad) నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో శుక్రవారం జరిగిన మెగా ఆయిల్ పామ్ మొక్కల పెంపక కార్యక్రమంలో మంత్రులు వివేక్​, పొన్నం ప్రభాకర్​ పాల్గొన్నారు. వంట నూనెల దేశీయ డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఆయిల్ పామ్ సాగు విస్తరణ అత్యవసరమని అన్నారు. అంతర్జాతీయ పరిణామాల వల్ల వంట నూనెల ధరలు పెరిగాయని, దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.

Oil Palm Cultivation | రూ.10 లక్షలు అందిస్తాం

ఈ పంట సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు, 100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగును చేపట్టిన ఏ గ్రామానికైనా రూ.5 లక్షల ప్రోత్సాహకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రకటించారు. దీనికి వెంటనే స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి, తన వంతుగా అదనంగా మరో రూ.5 లక్షలు ప్రకటించారు. ఆయిల్ పామ్ సాగులో ప్రారంభ సంవత్సరాల్లో కొంత ఓర్పు అవసరమైనప్పటికీ, దీర్ఘకాలంలో ఇది భారీ ఆదాయాన్ని అందిస్తుందని మంత్రి రైతులకు భరోసా ఇచ్చారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు మొదటి నాలుగేళ్లపాటు ప్రభుత్వ రాయితీలు, ‘రైతు భరోసా’ పథకం కింద ప్రయోజనాలు అందుతాయని తెలిపారు.

Oil Palm Cultivation | ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలి

vivek

రైతులు వరికి బదులుగా ఇతర పంటలు వేయాలని మంత్రి వివేక్​ సూచించారు. ప్రస్తుతం గిడ్డంగులు ధాన్యంతో నిండి ఉన్నాయని, బియ్యం ఎగుమతులపై ఆంక్షలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) పరిమిత సేకరణ కారణంగా రైతులు ప్రత్యామ్నాయ అధిక విలువ కలిగిన పంటలను సాగు చేయడం అవసరమైందని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగుతో కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని ఆయన కోరారు.

దీనిని కూడా చదవండి : Ponguleti Srinivasa Reddy | గుడ్ న్యూస్.. త్వరలో మరో 20 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *