అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగులేదని, రాబోయే ఎన్నికల్లోనూ ప్రజలు తమనే ఆశీర్వదిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన ‘రైతు ఆశీర్వాద సభ’లో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Revanth Reddy | రైతుల ఖాతాల్లోకి రూ.1,009 కోట్లు..
ఈ వేదిక నుంచి వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా తుది విడత నిధులు రూ. 1,009 కోట్లను సీఎం నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 74 లక్షల మంది రైతులకు, 1.45 కోట్ల ఎకరాలకు కలిపి మొత్తం రూ. 8,759 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించినట్లు ఆయన వెల్లడించారు.
Revanth Reddy | ఖమ్మంతో విడదీయలేని బంధం..
తన రాజకీయ ఎదుగుదలలో ఖమ్మం జిల్లా ఒక గుండెకాయ వంటిదని సీఎం వ్యాఖ్యానించారు. 2023 జులైలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పుడు వచ్చిన మార్పునే, నేడు ప్రజాపాలనలోనూ చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ అహంకార పాలనకు ప్రజలు చరమగీతం పాడారని, ఆ పార్టీని ఫాంహౌస్‌కే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఎన్ని మాయమాటలు చెప్పినా, గెలుపు కాంగ్రెస్‌దేనని తాను ముందే చెప్పానని, ప్రజలు అదే నిజం చేశారని గుర్తుచేశారు.
Revanth Reddy | 2029పై సీఎం భారీ వ్యూహం..
భవిష్యత్తు రాజకీయాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక జోస్యం చెప్పారు. 2029 జూన్ నెలలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, అప్పటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తయి అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఆ 182 సీట్లలో కాంగ్రెస్ ఒంటరిగానే 117 స్థానాలను గెలుచుకుని, రెండోసారి అధికారంలోకి వస్తుందని భద్రాచలం రాముడి సాక్షిగా ప్రమాణం చేశారు. ‘ఇది నా మాట మాత్రమే కాదు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పూనిన ప్రతిన’ అని ఆయన స్పష్టం చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 117 సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో 2029 మే లేదా జూన్ లో ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ సీట్లు 25, అసెంబ్లీ 182కు పెరుగుతాయని చెప్పారు. 182లో 117 సీట్లు గెలిచి రెండోసారి ప్రజాపాలన చేపడతామని ధీమా వ్యక్తం… pic.twitter.com/bdGkG3PjSg
— Akshara Today | Telugu News (@aksharatoday) July 10, 2026
ఇది కూడా చదవండి: Free Medical Camp | న్యాయవాదులు వృత్తితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి