అక్షరటుడే వెబ్‌డెస్క్: Prakash Raj Dharmasthala | ధర్మస్థల పవిత్రతను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రలో నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ‘చిన్నయ్య’ (ముసుగు మనిషి) హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రకాశ్‌రాజ్ పేరును ప్రస్తావించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Prakash Raj Dharmasthala | ఏమిటీ వివాదం?
ధర్మస్థల కేంద్రంగా వందలాది మంది యువతుల మృతిపై జరిగిన ప్రచారాలు, ఆరోపణల వెనుక భారీ కుట్ర ఉందని ఇప్పటికే సిట్ (SIT) విచారణలో తేలింది. ఈ కుట్రకు సూత్రధారిగా భావిస్తున్న చిన్నయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో.. నటుడు ప్రకాశ్‌రాజ్ కుట్రదారులతో కలిసి, “నేను మళ్లీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను” అని వ్యాఖ్యానించారని పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాకుండా, ధర్మస్థల పవిత్రతను దెబ్బతీసేందుకు కేరళ నుంచి ఏకంగా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో కుట్ర జరిగిందని ఆ పిటిషన్‌లో చిన్నయ్య ఆరోపించారు.

Prakash Raj Dharmasthala | ప్రకాశ్‌రాజ్ ఏమన్నారంటే?
సోషల్ మీడియాలో తన పేరు రావడంపై ప్రకాశ్‌రాజ్ శుక్రవారం స్పందించారు. ఈ అంశం కోట్లాది మంది భక్తుల నమ్మకాలతో ముడిపడి ఉందని, కాబట్టి దీనిపై వివరణ ఇవ్వడం తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. తాను ప్రస్తుతం ఊరికి దూరంగా ఉన్నానని, రెండు రోజుల్లో తిరిగి వచ్చి మీడియా ముందు పూర్తి విషయాలను వెల్లడిస్తానని తెలిపారు.
ధర్మస్థల కుట్ర లో ప్రకాష్ రాజ్ పేరు..! | Prakash Raj name in Dharmasthala Conspiracy | ABN Telugu#Dharmasthala #PrakashRaj @abntelugutv pic.twitter.com/W1ooO6m8yZ
— ABN Telugu (@abntelugutv) June 13, 2026
ఇది కూడా చదవండి: IAF AN-32 Crash | అస్సాంలో కూలిపోయిన ఐఏఎఫ్ విమానం
