Bhatti Vikramarka | మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన

రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bhatti Vikramarka | రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ‘మెగా రైతు మేళా’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు, మహిళా సంఘాల కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Bhatti Vikramarka | చేతల్లో చూపిస్తున్నాం..

“గత ప్రభుత్వం రైతుబంధు నిధులు జమ చేసేందుకు సుమారు 160 రోజులు సమయం తీసుకునేది. కానీ, మా ప్రభుత్వం రైతు భరోసా కింద కేవలం 9 రోజుల్లోనే రూ.9,000 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. మాటలతో కాకుండా, చేతలతో రైతు సంక్షేమాన్ని నిరూపిస్తున్నాం” అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సాగునీరు, ధాన్యం కొనుగోలు, వ్యవసాయ యాంత్రీకరణ వంటి రంగాలకు వేల కోట్లు వెచ్చిస్తున్నామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యమని ఆయన వివరించారు.

batti.1 1

Bhatti Vikramarka | మహిళా సాధికారతకు పెద్దపీట..

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన డ్వాక్రా మహిళల వడ్డీలేని రుణాలను కూడా తాము అందిస్తున్నామని వెల్లడించారు. తమ ప్రభుత్వం మహిళలకు రూ.లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రూ.67 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందజేశాము. మహిళలకు ఇచ్చే రుణ పరిమితిని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచాము. రైతులే దేశానికి వెన్నెముక అని, ఆ వెన్నెముకను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే నేటికీ రైతులకు జీవనాధారంగా నిలుస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి:  Oil Palm Cultivation | ఆయిల్ పామ్​ సాగు చేసే గ్రామాలకు ప్రోత్సాహకం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *