అక్షరటుడే, ఇందూరు: SIR Enumeration Forms | ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎస్‌ఐఆర్(SIR) ప్రక్రియ ఎంతో కీలకమైనదని, ప్రజలందరూ తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేయాలని డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. నగరంలో(Nizamabad) 42, 41, 40, 17, 11, 8, 27, 34 డివిజన్లలో ఎస్‌ఐఆర్ ప్రత్యేక ఓటరు సమగ్ర సర్వేపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
SIR Enumeration Forms | ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఎంతో కీలకం..
బొబ్బిలి రామకృష్ణ(Bobbili Ramakrishna) మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఎంతో కీలకమైనదని, ప్రజలందరూ తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేయాలని రామకృష్ణ కోరారు. గత 2002 ఓటరు జాబితాలో ఉన్న విధంగానే వివరాలను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు తమ పరిధిలోని బూత్‌లలో అందుబాటులో ఉంటూ, ప్రజలకు ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో సహాయం చేయాలని పిలుపునిచ్చారు.
బీఎల్ఏ సూపర్‌వైజర్లు తమకు కేటాయించిన డివిజన్లలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, బూత్ లెవెల్ ఏజెంట్లు స్థానిక బీఎల్ఓలకు పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో బీఎల్ఏ సూపర్‌వైజర్లు అవీన్, సాయి బసవ, శివ చరణ్, బంటు బలరాం, శోభన్, లవంగ ప్రమోద్‌లతో పాటు డివిజన్ ఇన్ఛార్జీలు రమేష్, అన్వర్, కరీముద్దీన్, సాయిలు, నరేందర్, ప్రవీణ్ గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: టర్కీ తన రష్యా-నిర్మిత S-400 వైమానిక రక్షణ వ్యవస్థలను ఒక గల్ఫ్ దేశానికి విక్రయించింది.