తెలంగాణCI & SI Caught by ACB | స్టేషన్​ బెయిల్​ కోసం లంచం.. ఏసీబీకి...

CI & SI Caught by ACB | స్టేషన్​ బెయిల్​ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన సీఐ, ఎస్సై

వికారాబాద్​ జిల్లా మహిళా పోలీస్​ స్టేషన్​లో సీఐ, ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CI & SI Caught by ACB | అవినీతి అధికారులు మారడం లేదు. లంచాలకు మరిగిన అధికారులు అన్ని శాఖాల్లో తిష్ట వేశారు. తమ వద్దకు వచ్చే వారిని లంచాల పేరిట పట్టి పీడిస్తున్నారు. ఇటీవల ఏసీబీ దాడులు చేపడుతున్నా.. కనీసం భయపడటం లేదు. తాజాగా లంచం తీసుకున్న ఏ సీఐ, ఎస్సైపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

వికారాబాద్​ (Vikararbad) జిల్లా మహిళా పోలీస్​ స్టేషన్​లో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఒక క్రిమినల్ కేసులో BNSS నోటీసులు జారీ చేయడానికి రూ.60,000 డిమాండ్ చేసిన సీఐ బి సరోజ (CI Saroja), ఎస్సై హెచ్​ రాణిపై కేసు నమోదు చేశారు. సదరు అధికారులు గతంలో పోలీస్​ స్టేషన్​లో రూ.20 వేలు లంచం తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ (ACB) అధికారులు నిందితులను అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

CI & SI Caught by ACB | రూ.60 వేలు డిమాండ్​

వికారాబాద్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌ (Women’s Police Station)లో ఓ వ్యక్తి, ఆయన కుటుంబ సభ్యులపై అతడి భార్య వేధింపుల కేసు పెట్టింది. మొత్తం ఆరుగురిపై కేసు పెట్టగా.. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.60 వేలు ఇవ్వాలని సీఐ, ఎస్సై డిమాండ్​ చేశారు. లంచం ఇస్తే అరెస్ట్ చేయకుండా నోటీసులతో సరి పెడతామన్నారు. అయితే బాధితులు బతిమిలాడటంతో ఆ మొత్తాన్ని రూ.40 వేలకు తగ్గించారు. ఇందులో రూ.20 వేలు గతంలోనే తీసుకున్నారు. మిగతా డబ్బు కోసం పోలీసులు డిమాండ్​ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు అధికారులు మంగళవారం విచారణ చేశారు. లంచం తీసుకున్నట్లు తేలడంతో సీఐ సరోజ, ఎస్సై రాణిపై కేసు నమోదు చేశారు.

bribe

CI & SI Caught by ACB | లంచం ఇవ్వొద్దు

ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలన ఇకోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్​9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఏసీబీ వెబ్​సైట్ (ACB Website)​ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

దీనిని కూడా చదవండి : TGPSC PCB Jobs | పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...