అక్షరటుడే, వెబ్‌డెస్క్: Fitness Challenge | క్రీడలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ క్రీడా శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఖేలో తెలంగాణ (Khelo Telangana) పేరుతో కార్యక్రమాలు రూపొందిస్తుంది.
క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ఖేలో తెలంగాణ పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ఖేలో తెలంగాణ నిరంతర కార్యక్రమం అన్నారు. ఇందులో భాగంగా ఖేలో తెలంగాణ బంధన్ ద్వారా ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం ప్రతి ఒక్కరు నిత్యం 30 నిమిషాలు కేటాయించేలా అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని వయసుల వారు తమకు అనువైన శారీరక వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలన్నారు.
Fitness Challenge | 9+9+9 ఛాలెంజ్
ఖేలో తెలంగాణ బంధన్‌లో భాగంగా 9+9+9 ఫిట్నెస్ ఛాలెంజ్ నిర్వహించనున్నారు. వాకింగ్, జాగింగ్, యోగా తదితర కార్యకలాపాల్లో పాల్గొని 27 సెకండ్ల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. దానిని 9 మిత్రులకు ట్యాగ్ చేసి, వారిని ఛాలెంజ్‌కు ఆహ్వానించాలని అధికారులు సూచించారు. ఒకరి నుంచి ఒకరికి ఫిట్నెస్ కార్యక్రమం విస్తరించడం దీని ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు.
దీనిని కూడా చదవండి : ACB Raids | రవాణా కార్యాలయంలో ఏసీబీ సోదాలు.. ఏజెంట్ల దగ్గర నగదు స్వాధీనం