Nizamabad Police Promotions | పలువురు హెడ్​కానిస్టేబుళ్లకు పదోన్నతులు.. అభినందించిన సీపీ

నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పలువురు హెడ్​ కానిస్టేబుళ్లు ఏఎస్సైలుగా పదోన్నతి పొందారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Police Promotions | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పలువురు హెడ్​ కానిస్టేబుళ్లు ఏఎస్సైలుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా వారిని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ప్రత్యేకంగా అభినందించారు.

Nizamabad Police Promotions | డీజీపీ ఆదేశాల మేరకు..

కమిషనరేట్​ పరిధిలో పదకొండు మంది హెడ్​కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పిస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వారంతా సీపీ కార్యాలయంలో పోలీస్​ కమిషనర్​ సాయిచైతన్యను మర్యాదపూర్వంగా కలిశారు. వారిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. పదోన్నతుల బాధ్యత మరింత పెరిగిందని.. నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు.

పదోన్నతి పొందిన వారు వీరే..

గంగాధర్ రావు (నందిపేట), రాజేశ్వర్ (ఉమెన్ పోలీస్ స్టేషన్), మోహన్ (సీసీఎస్​ పోలీస్​ స్టేషన్), జగదీశ్వర్ (పీసీఆర్​), చిన్న సాయిలు(సీఎస్​బీ), రాజశేఖర్(డిచ్​పల్లి), రాజేందర్ (సిరికొండ), సుదర్శన్ (నవీపేట్), డేనియల్ భాస్కర్ (టౌన్ వన్ పోలీస్ స్టేషన్), సుంకన్న (టౌన్ 2 పోలీస్ స్టేషన్), మల్లేశం(వర్ని).

ఇది కూడా చదవండి..: Ambedkar Ideals | అంబేడ్కర్​ ​ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి : ముత్యాల సునీల్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *