Ambedkar Ideals | అంబేడ్కర్​ ​ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి : ముత్యాల సునీల్​

అసమానతలను రూపుమాపడానికి అంబేడ్కర్​ తన జీవితాంతం కృషి చేశారని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్: Ambedkar Ideals | సమాజంలో వేళ్లూనుకున్న అసమానతలను రూపుమాపడానికి అంబేడ్కర్​ తన జీవితాంతం కృషి చేశారని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇన్‌ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పేర్కొన్నారు. మండలంలోని సుదర్శన్ నగర్ తండాలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు.

Ambedkar Ideals | అందరిపై బాధ్యత

అంబేడ్కర్​ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని సునీల్​ అన్నారు. అంబేడ్కర్​ అందించిన ‘బోధించు, పోరాడు, సమీకరించు’ (Educate, Agitate, Organize) అనే నినాదం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *