Modi Bishkek Visit | బిష్కెక్​లో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్థాన్​ చేరుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Modi Bishkek Visit | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కిర్గిస్థాన్​ చేరుకున్నారు. ఉజ్బెకిస్థాన్​ పర్యటన ముగించుకున్న ఆయన కిర్గిస్థాన్​లో బిష్కెక్​కు వెళ్లారు. అక్కడ ఆయనకు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ప్రధాని సోమవారం ఉదయం బిష్కెక్‌లో నగరంలోని మహాత్మా గాంధీ విగ్రహం నివాళులు అర్పించారు.

Modi Bishkek Visit |ఎస్​సీవో సదస్సులో..

అనంతరం పలు దేశాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. భారతదేశంతో సన్నిహిత సంబంధాలున్న ఒక బృందాన్ని కలిశానని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. వీరిలో ప్రముఖ ప్రవాస భారతీయులు, పర్యావరణం పట్ల ఆసక్తి ఉన్నవారు, యోగా ఔత్సాహికులు, విద్యావేత్తలు, ఐటెక్ పూర్వ విద్యార్థులు, పరిశోధకులు ఇంకా పలువురు ఉన్నారు. యోగా సాధకులలో ఒకరు అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని పతకం గెలుచుకున్నారని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని మోదీ రేపు బిష్కెక్‌లో జరిగే 26వ ఎస్​సీవో సదస్సులో పాల్గొంటారు.

ఇది కూడా చదవండి..: Kiran Rijiju | జాతీయ పతాకానికి అవమానం.. కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు ఆగ్రహం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *