Kiran Rijiju | జాతీయ పతాకానికి అవమానం.. కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు ఆగ్రహం

న్యూయార్క్​లో జాతీయ జెండాను అవమానించిన వారికి కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు వార్నింగ్​ ఇచ్చారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kiran Rijiju | న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద ఆర్‌ఎస్‌ఎస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ సమావేశం సమయంలో భారత జాతీయ జెండాను కాళ్లతో తొక్కడం, దానిని చింపివేయడం వంటి చర్యలకు పాల్పడిన నిరసనకారులు, ఖలిస్తానీ మద్దతుదారులను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హెచ్చరించారు. రాజకీయ విభేదాలు ఉండటం సహజమేనని, కానీ దేశాన్ని అవమానించడం మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, ప్రభుత్వంపై విమర్శలు చేసే స్వేచ్ఛ ఉంటుందన్నారు. కానీ మా దేశాన్ని దూషించవద్దు అన్నారు. బాగా గుర్తుంచుకోండి, మా జెండాను, నా దేశాన్ని అవమానించకండి. దీనికి మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని ఎక్స్​ వేదికగా ఆయన హెచ్చరించారు.

Kiran Rijiju | పోలీసులు చూస్తుండగా..

న్యూయార్క్​లో మోహన్​ భగవత్​ (Mohan Bhagwat) పర్యటన సమయంలో కొందరు ఖలిస్థాని మద్దతుదారులు జాతీయ జెండాను అవమానించారు. పోలీసులు చూస్తుండగా.. ఓ వ్యక్తి జెండాను కాలికి కట్టుకొని ఊపాడు. అనంతరం దానిని చించి వేశారు. అంతేగాకుండా ఖలిస్తాన్​ అనుకూలంగా నినాదాలు చేశారు. అయినా అమె పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారిని అడ్డుకునే యత్నం చేయకపోవడం గమనార్హం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​ కాగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Owaisi Comments | హిందూ చట్టాన్ని రుద్దుతున్నారు : అసదుద్దీన్​ ఒవైసీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *