Nizamabad Child Kidnapping | మాతాశిశు ఆస్పత్రిలో ఉద్రిక్తత.. సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి యత్నం..

నగరంలోని బస్టాండ్​ సమీపంలో జీజీహెచ్​కు అనుబంధంగా ఉన్న మాతా శిశు ఆస్పత్రిలో ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ క్రైం: Nizamabad Child Kidnapping | నగరంలోని(Nizamabad) బస్టాండ్​ సమీపంలో జీజీహెచ్​కు(GGH Nizamabad) అనుబంధంగా ఉన్న మాతా శిశు ఆస్పత్రిలో ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందిపై పలువురు దాడికి యత్నించారు..

Nizamabad Child Kidnapping | బాలుడి కిడ్నాప్​ ఉదంతంలో..

వివరాల్లోకి వెళ్తే.. బాల్కొండ(balkonda) మండలంలోని నాగాపూర్​ గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో శనివారం చికిత్స నిమిత్తం మాతాశిశు ఆస్పత్రికి వచ్చారు. అయితే వారిద్దరు పిల్లలు బయట ఆడుకుంటుండగా.. అందులో చిన్న బాలుడిని ఓ మహిళ మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లింది. ఈ ఘటనపై సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం ఉందని ఆరోపిస్తూ నాగాపూర్​ గ్రామస్తులు కొందరు ఆదివారం మాతాశిశు ఆస్పత్రికి వచ్చారు. అక్కడి సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వారిని సముదాయించారు.

Nizamabad Child Kidnapping | 8 బృందాలతో బాలుడి కోసం సెర్చింగ్​..

నగరం నడిబొడ్డున జీజీహెచ్​ అనుబంధ మాతాశిశు ఆస్పత్రిలో బాలుడి కిడ్నాప్​ జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతాన్ని సీరియస్​గా తీసుకున్న సీపీ సాయిచైతన్య ప్రత్యేకంగా 8 బృందాలను నియమించారు.

ఇది కూడా చదవండి: India Population Clock | రాకెట్ వేగంతో పెరుగుతున్న జనాభా.. ఎయిమ్స్ డిజిటల్ పాపులేషన్ క్లాక్ సంచలనం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *