Bonalu Festival | తెలంగాణ సంస్కృతికి ప్రతీక ‘బోనం’ : అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మహత్తర పండుగ ‘బోనాలు’ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Bonalu Festival | తెలంగాణ సంస్కృతి (Telangana Culture), సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మహత్తర పండుగ ‘బోనాలు’ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) తెలిపారు. నగరంలోని(Nizamabad) కోటగల్లిలో కట్ట మైసమ్మ ఆలయం, నాందేవ్​వాడ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగలో పాల్గొన్నారు.

Bonalu Festival | ఆషాఢమాసం.. ప్రత్యేకం..

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆషాఢ మాసం తెలంగాణకు ప్రత్యేక మాసం అన్నారు. గ్రామ దేవతలకు పూజిస్తూ.. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పశువులు ఆరోగ్యంగా ఉండాలని కొలిచే పండగ అన్నారు. బోనాలు కేవలం పండుగ మాత్రమే కాదని, ఇది మన పూర్వీకుల సంప్రదాయాన్ని.. గ్రామదేవతల పట్ల ఉన్న విశ్వాసాన్ని తరతరాలకు అందించే ఆధ్యాత్మిక వేడుక అన్నారు.

Bonalu Festival | అమ్మవారికి సమర్పించే నైవేద్యం..బోనం

బోనం అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పోతురాజుల నృత్యాలు, ఘటం ఊరేగింపులు, రంగం వంటి సంప్రదాయాలు పండుగకు మరింత వైభవాన్ని తీసుకువస్తాయన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చింతకాయల రాజేందర్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, కోటగల్లి మైసమ్మ ఆలయ ప్రతినిధులు దేవేందర్  పాల్గొన్నారు.

amma bon bonalu bonam bonbon

ఇది కూడా చదవండి: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఆకస్మిక వరదల బారిన పడిన ఐదుగురు పిల్లలతో సహా 11 మంది పౌరులను రక్షించిన భారత సైన్యం 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *