Nizamabad Child Kidnapping | జీజీహెచ్​లో కలకలం.. బాలుడి కిడ్నాప్​

నగరంలోని జీజీహెచ్​ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Child Kidnapping | నగరంలోని జీజీహెచ్ (GGH Nizamabad)​ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. కొన్నినెలల క్రితం నవజాత మృతదేహం డ్రైనేజీలో లభ్యం కావడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న మాతాశిశు ఆస్పత్రిలో బాలుడి కిడ్నాప్​ ఉదంతం కలకలం రేపుతోంది.

Nizamabad Child Kidnapping | ఆస్పత్రిలో ఆడుకుంటుండగా..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాల్కొండ మండలంలోని నాగపూర్​ గ్రామానికి చెందిన భార్యాభర్తలు తమ ఇద్దరి పిల్లలతో జీజీహెచ్​కు అనుబంధంగా ఉన్న మాతశిశు ఆస్పత్రికి వచ్చారు. తల్లిదండ్రులు ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వైద్యులతో మాట్లాడుతుండగా.. ఇద్దరు బాలురు ఆస్పత్రి ఆవరణలో ఆడుకుంటున్నారు. అయితే ఇద్దరిలో రెండున్నరేళ్ల చిన్నబాలుడిని ఓ మహిళ తీసుకెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. బాలుడి మిస్​ అయ్యాడనే సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే 112కు కాల్​ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.

govt

ఇది కూడా చదవండి: దుర్గం చెరుపై KTR ట్వీట్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *