Fire Accident in Mendora | దేవుడి దీపంతో అగ్ని ప్రమాదం.. రెండిళ్లు దగ్ధం

Balla Sandeep Kumar

అక్షరటుడే, మెండోరా: Fire Accident in Mendora | దేవుడి వద్ద వెలిగించిన దీపంతో మంటలు అంటుకొని రెండు ఇళ్లు కాలిపోయాయి. ఈ ఘటన మెండోరా (Mendora)లో చోటు చేసుకుంది.

Fire Accident in Mendora

మెండోరా గ్రామానికి చెందిన కుమ్మరి రాజరాపు బక్కన్న భార్య పద్మ ఇంట్లో దేవుని వద్ద దీపం వెలిగించింది. అనంతరం బయటకు రాగానే కొద్దిసేపటికి ఇంట్లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న బక్కన్న అన్న రాజేశ్వర్ ఇంటికి కూడా వ్యాపించడంతో రెండు ఇళ్లలో అగ్నిప్రమాదం సంభవించింది.

Fire Accident in Mendora | కాలిపోయిన నగదు

Fire Accident in Mendora

మంటలను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి వాటిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే రెండు ఇళ్లలోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. బక్కన్న ఇంట్లో రూ.15,800 నగదుతో పాటు గృహోపకరణాలు కాలిపోగా, రాజేశ్వర్ ఇంట్లో రూ.8,000 నగదు ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో రెండు ఇళ్లకు కలిపి సుమారు రూ.25 వేల మేర ఆస్తి నష్టం జరిగినట్లు రెవెన్యూ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. స్థానిక అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

ఇది కూడా చదవండి..: Armoor Gas Leak | ఆర్మూర్​లో గ్యాస్ లీకేజీ.. ఇద్దరికి గాయాలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *