Viksit Bharat | పీఎం మోదీ సారథ్యంలో దేశం అన్నిరంగాల్లో ముందడుగు..

పీఎం మోదీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో ముందడుగు వేస్తోందని ఎంపీ అర్వింద్ అన్నారు. ప్రధానమంత్రి వికసిత్​ భారత్​ రోజ్​గార్​ యోజన లబ్ధిదారులకు ప్రోత్సాహక నిధులను అందజేశారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Viksit Bharat | పీఎం మోదీ (PM MODI) సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో ముందడుగు వేస్తోందని ఎంపీ అర్వింద్ (Mp Arvind)​ అన్నారు. ప్రధానమంత్రి వికసిత్​ భారత్​ రోజ్​గార్​ యోజన లబ్ధిదారులకు నగరంలో  ప్రోత్సాహక నిధులను అందజేశారు.

Viksit Bharat |12 ఏళ్ల పాలనలో..

దేశంలో అత్యధిక కాలం పాలన చేసిన ప్రధానుల్లో మోదీ ముందు వరుసలో నిలిచారన్నారు. ఆయన సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి వికసిత్​ భారత్​ రోజ్​గార్​ యోజన పథకం ఎంతోమంది యువతకు ఆసరాగా నిలుస్తోందని.. ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలో, రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న వారు ఆనందంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు లబ్ధిదారులకు ప్రోత్సాహక నిధులను అందజేశారు. అనంతరం ప్రధాని ప్రసంగాన్ని విన్నారు.

mpmp

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *