Revanth Reddy Education | విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్నాం : సీఎం రేవంత్​రెడ్డి

విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Education | విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. బడ్జెట్‌లో 8.5 శాతం నిధులు విద్యకు కేటాయించామని చెప్పారు.

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి రూ.50.73 కోట్లతో రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేనశారు. రూ.36.65 కోట్లతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టనున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పదేళ్లగా పెంచని డైట్ చార్జీలు తాము అధికారంలోకి వచ్చాక పెంచామన్నారు. కాస్మొటిక్ చార్జీలు 200శాతం పెంచినట్లు తెలిపారు.

cm 4

Revanth Reddy Education | నర్సరీ విధానం

మొదటిసారి ప్రభుత్వ స్కూళ్లలో నర్సరీ విధానం అమలు చేస్తున్నట్లు రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆలోచించేవారన్నారు. కానీ ప్రస్తుతం ఆరుట్లలో నో అడ్మిషన్ బోర్డుపెట్టారని చెప్పారు. తరగతి గదుల్లోనే తెలంగాణ, దేశ అభివృద్ధి ఉందన్నారు.

Revanth Reddy Education | వందేళ్ల నష్టం

గత పాలకుల అరాచకంతో వందేళ్ల నష్టం జరిగిందని సీఎం ఆరోపించారు. విధ్వంసం అయిన విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్నామని తెలిపారు. పేదలకు నాణ్యమైన విద్య అందాలనే విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నట్లు వెల్లడించారు.

Revanth Reddy Education | శంకుస్థాపనల వివరాలు

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో క్రీడా వసతుల కోసం సీఎం వర్చువల్​గా శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి (Rangareddy) జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్ మండల కేంద్రంలో మినీ స్టేడియం, సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని డా.,బీఆర్ అంబేద్కర్ స్టేడియం ఆధునీకరణ చేపట్టనున్నారు. నారాయణపేట్ జిల్లా నర్వలో మినీ స్టేడియం, వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణంలో మల్టీ పర్పస్ స్టేడియం, కామారెడ్డి జిల్లా గాంధారిలో మినీ స్టేడియం నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.

Revanth Reddy Education | ప్రారంభోత్సవాల వివరాలు

గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన FIFA AIFF తెలంగాణ టాలెంట్ అకాడమీని రేవంత్​రెడ్డి ప్రారంభించారు. అలాగే అథ్లెటిక్స్ అకాడమీ, హాకీ అకాడమీని ప్రారంభించారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫుట్ బాల్ అకాడమీని సైతం ఆయన ప్రారంభించారు.

దీనిని కూడా చదవండి : Kinnerasani Jungle Safari | ‘కిన్నెరసాని’ అందాలు చూద్దామా.. జంగిల్ సఫారీ ప్రారంభం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *