అక్షరటుడే, కామారెడ్డి: Lok Adalat | జాతీయ లోక్ అదాలత్‌ను (National Lok Adalat) కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఛైర్మన్ డాక్టర్ సీహెచ్‌వీ ఆర్ఆర్ వర ప్రసాద్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
Lok Adalat | 20న జిల్లా కోర్టులో..
కామారెడ్డి కోర్టులో(Kamareddy Court) లోక్ అదాలత్ ద్వారా పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసులు (Legal Settlement), క్రిమినల్ కేసులు, మోటారు వాహన ప్రమాదాల కేసులు, బ్యాంకు రుణ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ వివాదాలు తదితర కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే సమయం, ఖర్చు ఆదా అవుతాయని, ఇక్కడ ఇచ్చే అవార్డులు తుది తీర్పులుగా చెల్లుబాటు అవుతాయని తెలిపారు. ఈ నెల 20న నిర్వహించనున్న లోక్‌అదాలత్ కోసం కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి కోర్టులలో మొత్తం 8 బెంచీలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలందరూ జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: Jio AI Agent | త్వరలో ‘హే జియో’! కొత్త ఏఐ ఏజెంట్‌ను ప్రకటించిన అంబానీ