Indiramma House Inauguration | అట్టహాసంగా ‘ఇందిరమ్మ’ గృహ ప్రవేశాలు.. పాల్గొన్న కలెక్టర్​

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి : Indiramma House Inauguration | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) పథకంలో నిర్మాణం పూర్తయిన గృహాల ప్రారంభోత్సవాలు సోమవారం జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్ ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), అదనపు కలెక్టర్ ఎన్.వి. గిరి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఉమారాణి పాల్గొన్నారు.

Indiramma House Inauguration | ప్రభుత్వానికి కృతజ్ఞతలు

indiramma illu 1

లబ్ధిదారులు పెరుమాళ్ల లింగం, ఎల్లవ్వల నూతన గృహంలో కలెక్టర్ స్వయంగా గృహప్రవేశం నిర్వహించారు. లబ్ధిదారులకు దుస్తులను అందజేశారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. దీనికి అనుగుణంగా కామారెడ్డి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్మాణం పూర్తయిన ఇళ్లను ప్రారంభించారు.

కలెక్టర్ సంగ్వాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతో సొంత ఇంటి కలను సాకారం చేసుకున్న లబ్ధిదారులను అభినందించారు. నూతన గృహాల్లోకి ప్రవేశించిన లబ్ధిదారులు తమ సొంతింటి కలను నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ, తహశీల్దార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

indiramma illu

దీనిని కూడా చదవండి : IIT Advanced Results | ఐఐటీ అడ్వాన్డ్స్ ఫలితాల్లో కాకతీయ విద్యార్థుల ప్రభంజనం..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *