Irrigation Encroachments | ఇరిగేషన్​ స్థలాల్లో ఆక్రమణలు.. చోద్యం చూస్తున్న అధికారులు..

గాంధారి మండలంలో ఇరిగేషన్​ భూములు, చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయి. అక్రమార్కులు కొన్నేళ్లుగా నీటిపారుదల శాఖ భూములను లక్ష్యంగా చేసుకున్నారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, గాంధారి: Irrigation Encroachments | గాంధారి మండలంలో విలువైన ఇరిగేషన్​ భూములు (Irrigation Department), చెరువులు, కుంటలు ఆక్రమణలకు(Land Encroachment) గురవుతున్నాయి. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు కబ్జా చేసేందుకు సిద్ధమవుతున్న అక్రమార్కులు కొన్నేళ్లుగా నీటిపారుదల శాఖ భూములను లక్ష్యంగా చేసుకున్నారు. సంబంధిత శాఖ సైతం ఈ ఆక్రమణపై స్పందించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.

Irrigation Encroachments | 45 గ్రామ పంచాయతీలు..

గాంధారి(Gandhari) మండలంలో 45 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఆయా ప్రాంతాల్లో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. మండలంలో దాదాపు 104 చెరువులు ఉండగా వాటిలో దాదాపు సగానికి పైగా కబ్జాలకు గురయ్యాయి. స్థానికంగా ఉన్న బడా నాయకులు, భూకబ్జాదారులు వాటిని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. అలా కబ్జా చేసిన వాటిని మొరంతో లెవల్​ చేయించి అనంతరం అమాయకులకు అంటగడుతున్నారు. కుంటలు, కాలువలు ఇలా ప్రభుత్వ సంబంధిత స్థలాలపై కన్నేశారు.

Irrigation Encroachments | రాబోయే తరాలకు కష్టమే..

చెరువులు, కుంటలు, కాలువలు ఆక్రమణ జరుగుతున్నా స్థానికంగా అధికారులు గాని.. ఇరిగేషన్​ శాఖ సిబ్బంది కాని పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా చెరువులను కబ్జా చేస్తూ పోతే భవిష్యత్తు తరాలను నీటివనరులు కనుమరుగవుతాయని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కబ్జాల కారణంగా నీటినిలువ సామర్థ్యాలు తగ్గిపోయి తాగు,సాగునీటికి ఇబ్బందులు తప్పవని పేర్కొంటున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారని.. ఇలా తటాకాలను, సంబంధిత భూములను కబ్జా చేస్తూ పోతే.. భవిష్యత్తు మరింత భయానకంగా తయారువుతుందని వారంటున్నారు.

Irrigation Encroachments | ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం..

– వంశీకృష్ణ, ఇరిగేషన్ ఏఈ

గాంధారి మండల కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఆక్రమణలు జరుగుతున్నాయి. మేం కూడా ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక అందజేస్తున్నాం. కబ్జాకు గురైనట్లుగా ఆరోపణలు వస్తున్న ప్రాంతాల్లో సర్వే చేయిస్తాం. ఇరిగేషన్​ శాఖకు సంబంధించిన భూములను తప్పనిసరిగా కాపాడుతాం.

landsss

 

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *