Police Retirement Ceremony | ప్రభుత్వ ఉద్యోగికి పదవీవిరమణ సహజమే..: సీపీ సాయిచైతన్య

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీవిరమణ సహజమేనని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ సిటీ: Police Retirement Ceremony | ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీవిరమణ సహజమేనని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. పోలీస్​ శాఖలో పదవీవిరమణ పొందిన సిబ్బందిని సీపీ కార్యాలయంలో బుధవారం ఘనంగా సన్మానించారు.

Police Retirement Ceremony | రిమార్క్​లేకుండా పదవీవిరమణ..

మాక్లూర్​ ఏఎస్సై లక్ష్మణ్​ 36ఏళ్ల పాటు పోలీస్​శాఖలో విధులు నిర్వహించి పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్​శాఖలో ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అయినప్పటికీ ఎలాంటి రిమార్కు లేకుండా లక్ష్మణ్​ పదవీ విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందన్నారు. పదవీ విరమణ అనంతరం సైతం పోలీస్​శాఖ ఎల్లవేళలా మద్దతుగా ఉంటుందని సీపీ తెలిపారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ యాషియా బేగం, ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, జగతి, వనమాల, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీధర్ రెడ్డి, రిజర్వ్​ ఇన్​స్పెక్టర్లు (అడ్మిన్/వెల్ఫేర్) ధరణి కుమార్, శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kisan Mela 2026 | రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *