Police Exam Study Material | పోలీసు ఉద్యోగార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్​ పంపిణీ

పోలీస్ ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఉచిత స్టడీ మెటీరిలయ్​ పంపిణీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Police Exam Study Material | పోలీస్ ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఉచిత స్టడీ మెటీరిలయ్​ పంపిణీ చేశారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.

Police Exam Study Material | నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో..

నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా శనివారం గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఆడిటోరియంలో 250 మంది అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. 60 రోజుల పాటు ఉచిత శిక్షణ, ఈ ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ కార్యక్రమం 60 రోజుల పాటు కొనసాగనుందని సీపీ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన భాగ్య కిరణ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు , నిపుణులచే అభ్యర్థులకు శిక్షణ అందిస్తున్నారన్నారు.

గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఆడిటోరియంలో తరగతులు నిర్వహిస్తున్నారు. పోటీ పరీక్షలకు సమగ్ర మార్గదర్శకత్వం శిక్షణలో భాగంగా పోలీస్ రిక్రూట్‌మెంట్ పోటీ పరీక్షలకు అవసరమైన వివిధ అంశాలపై అభ్యర్థులకు సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు. నిరుద్యోగ యువతకు సరైన మార్గదర్శకత్వం అందించడం పోలీస్ శాఖ సామాజిక బాధ్యతలో ఒక భాగమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్.శుభం ప్రకాష్, నిజామాబాద్ సీటీసీ ఏసీపీలు ప్రకాష్ యాదవ్, రాజశేఖర్, అధ్యాపక బృందం, శిక్షణ పొందుతున్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Capsicum Farming Profits | మిర్చి, క్యాప్సికం సాగుతో అధిక లాభాలు: కలెక్టర్​ అశిష్​ సంగ్వాన్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *