అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Police Retirement | పదవి విరమణ అనేది ప్రతి ఒక్క ఉద్యోగికి సహజమేనని సిపి సాయి చైతన్య (CP Sai Chaitanya) అన్నారు. పోలీస్ శాఖ నుంచి ఉద్యోగ విరమణ చేస్తున్న పలువురిని సిపి కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
Police Retirement | పోలీసు శాఖ అండగా ఉంటుంది..
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎటువంటి రిమార్క్ లేకుండా సుదీర్ఘ కాలం సేవలందించి పదవీ విరమణ పొందడం అభినందనీయమన్నారు. డిపార్ట్‌మెంట్ తరపున ఎల్లవేళలా సహకారం ఉంటుందని, పదవీ విరమణ అనంతరం తమ కుటుంబాలతో ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. సత్కారం పొందిన వారిలో
టి. శ్రీనివాస్ గౌడ్ (ఏఎస్సై , టౌన్-5 పీఎస్),శీలంపల్లి వెంకటేశ్వర్ (ఏఎస్సై, నవీపేట్ పీఎస్),అబ్దుల్ హమీద్ ఖాన్ (ఏఎస్సై , టౌన్-3 పిఎస్),
నీలి శేఖర్ (హెడ్ కానిస్టేబుల్, కంట్రోల్ రూమ్) ఉన్నారు. కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సిబ్బందిని శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, జగతి, వనమాల, ఎస్‌బీ ఇన్స్‌పెక్టర్ మల్లేష్, ఆర్‌ఐలు ధరణి కుమార్, శేఖర్ బాబు, పదవీ విరమణ పొందిన సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Police Exam Study Material | పోలీసు ఉద్యోగార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ