Banswada Daylight Theft | కిరాణాషాప్​నకు వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల.. బాన్సువాడలో ఘటన

బాన్సువాడలో పట్టపగలే చోరీ జరిగింది.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ : Banswada Daylight Theft | పట్టణంలో పట్టపగలే భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. షేక్ చాంద్ హోటల్ సమీపంలోని చింతల భాస్కర్ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు భారీగా బంగారం దోచుకెళ్లారు.

Banswada Daylight Theft | దుకాణానికి వెళ్లి వచ్చేసరికి..

బాధితుడు చింతల భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి తన కిరాణా దుకాణానికి వెళ్లారు. కొంతసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువా తెరిచి ఉండడంతోపాటు అందులో భద్రపరిచిన బంగారు ఆభరణాలు కనిపించలేదు. బీరువాలో ఉన్న సుమారు 29.05 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు బాధితుడు గుర్తించారు. వెంటనే బాన్సువాడ (Banswada) పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పట్టపగలే ఇంటి తాళాలు పగలగొట్టి భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు అపహరణకు గురికావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Vote Theft Protest | జ్ఞానేశ్ కుమార్​ను దేశద్రోహిగా ప్రకటించి అరెస్ట్ చేయాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *