అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Vote Theft Protest | ఎన్నికల ప్రక్రియను నిర్వీర్యం చేస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను దేశద్రోహిగా ప్రకటించి అరెస్ట్ చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు (MLA Thota Lakshmikantha Rao) డిమాండ్ చేశారు. కామారెడ్డి (Kamareddy) కలెక్టరేట్ వద్ద ఓటు చోరీపై సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
Kamareddy Vote Theft Protest | జ్ఞానేష్‌కుమార్ దిష్టిబొమ్మ దహనం..
జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి ముందుగా కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు మాట్లాడుతూ.. ఓటు చోరీ అంశాన్ని వెలుగులోకి తెచ్చిన రాహుల్ గాంధీ వెంట దేశం మొత్తం నిలబడుతోందన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని విమర్శించారు. కుటిల నీతితో ఓట్లను తొలగించి ఫారం-6ను ఏకపక్షంగా తయారు చేసి యువకులను ఓటు హక్కులో పాల్గొనకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ అని పేర్కొన్నారు. ఓటు చోరీపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తమ నియోజకవర్గాల్లో విదేశీయులు ఎవరున్నారో ఎంపీ అర్వింద్ చూపించాలని, అసంబద్ధమైన మాటలు మాట్లాడటం తప్పని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ఇలియాస్, మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సందీప్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: వాట్సాప్‌కు కొత్త లుక్..త్వరలో నయా ఫ్లోటింగ్ బార్!