అక్షరటుడే వెబ్డెస్క్: October 1 Rule Changes | మరో రెండు రోజుల్లో సెప్టెంబర్ నెల ముగిసి అక్టోబర్ ప్రారంభం కానుంది. ప్రతి నెల 1వ తేదీ వస్తే.. సామాన్యుల ఆర్థిక జీవితాన్ని ప్రభావితం చేసే కొన్ని మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ముఖ్యమైన మార్పుల వివరాలు ఇలా ఉన్నాయి.
October 1 Rule Changes | ఎల్పీజీ ఈ-కేవైసీ ..
గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ (E-KYC) గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. అక్రమ గ్యాస్ కనెక్షన్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ నిబంధన తెచ్చింది. ఒకవేళ ఈ నెలాఖరులోపు ఈ-కేవైసీ పూర్తి చేసుకోకపోతే గ్యాస్ సబ్సిడీ రాయితీ నిలిచిపోయే అవకాశం ఉంది. వినియోగదారులు ఆయిల్ కంపెనీల మొబైల్ యాప్లు, గ్యాస్ ఏజెన్సీలు లేదా డీలర్ల వద్ద దీన్ని పూర్తి చేసుకోవచ్చు.
October 1 Rule Changes | యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు ..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ లావాదేవీలకు సంబంధించి కొత్త విధానాన్ని ప్రకటించింది. వ్యక్తి – వ్యాపారుల (P2M) కేటగిరీలో రూ.2,000 పైబడిన లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) వర్తించనుంది. ఉదాహరణకు రూ.2 వేలకు 0.4 శాతం అంటే రూ.8 MDR అవుతుంది. అయితే ఈ ఛార్జీలు పూర్తిగా వ్యాపారులకే వర్తిస్తాయని, సాధారణ వ్యక్తిగత (P2P) లావాదేవీలకు , చిరు వ్యాపారులకు దీని నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే పెట్రోల్ బంకులు, ఇన్సూరెన్స్ పేమెంట్లకు MDR రూ.5 వర్తించనుంది.
October 1 Rule Changes | గ్యాస్ సిలిండర్ ధరలు..
ప్రతి నెలా 1వ తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముడిచమురు ధరల ఆధారంగా ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈసారైనా ధరలు మారుతాయా లేదా అనేది స్పష్టత రానుంది.
October 1 Rule Changes | FD కొత్త నిబంధనలు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బల్క్ డిపాజిట్లపై (రూ.3 కోట్లు అంతకంటే ఎక్కువ) కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి బ్యాంకులు ఈ భారీ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను ప్రతిరోజూ ఉదయం 10 గంటలకల్లా తమ అధికారిక వెబ్సైట్లో తప్పనిసరిగా అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది. డిపాజిట్ల వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకులు ఎలాంటి వివక్ష చూపకూడదని నిబంధనలు తెచ్చింది.
ఇది కూడా చదవండి: Kamareddy Vote Theft Protest | జ్ఞానేశ్ కుమార్ను దేశద్రోహిగా ప్రకటించి అరెస్ట్ చేయాలి