Indur Corporation Protest | అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఇందూర్ కార్పొరేషన్ : ఎమ్మెల్యే ధన్​పాల్​

అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఇందూర్ కార్పొరేషన్ మారిందని ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ ఆరోపించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ:  Indur Corporation Protest | అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఇందూర్ కార్పొరేషన్ మారిందని ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. కార్పొరేషన్​ పరిధిలో సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఫ్లోర్​ లీడర్​ ప్రమోద్​ కుమార్​ ఆధ్వర్యంలో ధర్నా చౌక్​లో భారీ ధర్నా నిర్వహించారు.

 Indur Corporation Protest | రూపాయి ఖర్చు చేయడం లేదు​

ఎమ్మెల్యే ధన్​పాల్​ మాట్లాడుతూ.. ప్రతి బడ్జెట్ మీటింగ్​లలో రూ.కోట్లు కేటాయిస్తున్నారు కానీ.. పనుల కోసం రూ.రూపాయి ఖర్చు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.అభివృద్ధి కోసం ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా ధర్నా చేస్తున్నానంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కార్పొరేషన్​లో రూ.150 కోట్ల ఆదాయం, రూ.94 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నా రూ.ఒక్క రూపాయి ఖర్చు చేయకపోవడం సిగ్గుచేటున్నారు. పీసీసీ అధ్యక్షుడు నిజామాబాద్ అభివృధ్ధికి రూ.200 కోట్లు మంజూరు చేస్తామని చెప్పి ఇప్పటివరకు విడుదల చేయలేదన్నారు. బడ్జెట్​లో డివిజన్ల అభివృద్ధి కోసం రూ.35 కోట్లు కేటాయించినా.. ఇప్పటి వరకు ఒక్క డివిజన్​కు కూడా రూపాయి కేటాయించలేదన్నారు.

 Indur Corporation Protest | వీధికుక్కల బెడద

బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి (Dinesh Kulachari) మాట్లాడుతూ.. గత ఏడు నెలలుగా మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమలు బెడదతో ప్రజారోగ్యం క్షీణించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వీధి కుక్కల బెడద ఎక్కువైందన్నారు. కుక్కల బెడత వెంటనే పరిష్కరించకపోతే నగరంలో ఉన్న కుక్కలన్నింటిని పీసీసీ చీఫ్​ ఇంట్లోకి వదులుతామని హెచ్చరించారు. విలీన గ్రామాల డివిజన్లలో పరిస్థితి మరింత అధ్వానంగా మారిందన్నారు.

 Indur Corporation Protest | కార్పొరేషన్ ముట్టడి.. ఉద్రిక్తత

బల్దియా సమస్యల పరిష్కారానికి, కమిషనర్ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ధర్నాచౌక్​లో ధర్నా అనంతరం కార్పొరేషన్ కార్యాలయ ముట్టడికి బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు బయలుదేరారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు, బీజేపీ కార్పొరేటర్లు మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ , జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ వచ్చే వరకు జరిగేది లేదని హెచ్చరించి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బైఠాయించారు. అనంతరం కమిషనర్ దిలీప్ కుమార్ వినతిపత్రం అందజేశారు.

ఇది కూడా చదవండి..: Banswada Daylight Theft | కిరాణాషాప్​నకు వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల.. బాన్సువాడలో ఘటన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *