అక్షరటుడే, ఎల్లారెడ్డి: Chain Snatching | ఉమ్మడిజిల్లాలో చైన్ స్నాచర్లు పేట్రేగిపోతున్నారు. రోడ్డుపైన, బస్టాండ్లలో మహిళలను టార్గెట్ చేస్తూ ఆభరణాలు లాక్కెళ్తున్నారు.
Chain Snatching | ఎల్లారెడ్డి బస్టాండ్‌లో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి (Yellareddy) బస్టాండ్‌లో ఆదివారం సాయంత్రం ఇద్దరు మహిళల మెడలోని బంగారు గుండ్లను దొంగలు మాయం చేశారు. లింగంపేట్ మండలం భవానీపేట్కు చెందిన నాగులూరి సుశీల భవానీపేట్ వెళ్లేందుకు బస్సు ఎక్కిన తర్వాత తన మెడలో ఉన్న సుమారు 1.5 తులాల బంగారు గుండ్లు కనిపించకపోవడాన్ని గుర్తించారు. అదేవిధంగా ఎల్లారెడ్డి మండలం సోమార్ పేట్ గ్రామానికి చెందిన కుసులకంటి దీవెన బాన్సువాడ బస్సు ఎక్కిన అనంతరం తన మెడలోని సుమారు 1.5 తులాల బంగారు గుండ్లు పోయినట్లు గుర్తించి వెంటనే ఎల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Revenue Conclave | నిజామాబాద్ రెవెన్యూ కాంక్లేవ్‌లో ఉద్యోగుల ఐక్యతకు ప్రాధాన్యం