అక్షరటుడే, ఎల్లారెడ్డి: Gas Cylinder Auto | వర్షం పడుతున్న వేళ గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. మెదక్–నర్సాపూర్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మెదక్–నర్సాపూర్ రోడ్డుపై..
మెదక్ (Medak)– నర్సాపూర్ రోడ్డుపై చింతకుంట సమీపంలో గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. వర్షం పడుతుండటంతో ఆటో అదుపుతప్పినట్లు స్థానికులు తెలిపారు. ఆటోలో ఉన్న సిలిండర్లు రోడ్డుపై పడిపోయాయి. ఆ సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోకలు లేకపోవడం వల్ల భారీప్రమాదం తప్పిందని, డ్రైవర్‌కు సైతం ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Chain Snatching | బస్టాండ్‌లో చైన్‌స్నాచింగ్.. ఇద్దరు మహిళల నగలు మాయం