అక్షరటుడే, మెండోరా: SRSP Inflow | గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీలోకి ఇన్ఫ్లో పెరుగుతోంది. మహారాష్ట్రలోనూ మోస్తరుగా వర్షాలు పడుతుండడంతో వరద వస్తోంది.
SRSP Inflow | 44 టీఎంసీల నీటి నిల్వ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం 1,013 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో సోమవారం 2,894 క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు (80.50 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1,079.80 అడుగుల (44.489 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టు (Sri Ram Sagar Project)లో 80.053 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ప్రస్తుతం సుమారు 35.56 టీఎంసీల మేర తక్కువగా ఉంది. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 1,013 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,544 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది.
ఇది కూడా చదవండి..: Gas Cylinder Auto | గ్యాస్సిలిండర్ ఆటో బోల్తా.. తప్పిన ప్రమాదం