Bike Theft | బైక్​ చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్​

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Bike Theft | వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు(Nizamabad Police) ఎట్టకేలకు అరెస్ట్​ చేశారు. ఈ మేరకు వన్ టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి వివరాలు వెల్లడించారు.

Bike Theft | తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా..

ఎస్​హెచ్​వో తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ పరిధిలో ప్రధాన ప్రాంతాల్లో ఇటీవల తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా తాను బాన్సువాడ(banswada) నుంచి వస్తున్నానని తెలిపాడు. వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు చూపించాలని అడగగా తన వద్ద లేవని.. బైక్​ను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిని మరింత లోతుగా విచారించగా(Police Investigation) జనవరి నుంచి ఐదు బైక్​లను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతడు ఇచ్చిన సమాచారం మేరకు బైక్​లను కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్​హెచ్​వో తెలిపారు. అనంతరం కోర్టులో హాజరుపర్చినట్లు వివరించారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *