MLA KVR | రైతుబీమా పథకాన్ని నిర్వీర్యం చేయడం బాధాకరం: ఎమ్మెల్యే కేవీఆర్​

రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని నిర్వీర్యం చేయడం బాధాకరమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. శనివారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: MLA KVR | రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా (Rythu Bima) పథకాన్ని నిర్వీర్యం చేయడం బాధాకరమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి(MLA Venkata Ramana Reddy) అన్నారు. శనివారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు.

MLA KVR | రూ.442 కోట్ల ప్రీమియం బాకీ..

ఎమ్మెల్యే కేవీఆర్​ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా(Telangana) ఎల్ఐసీకి (LIC) ప్రభుత్వం రూ.442 కోట్లు ప్రీమియం చెల్లించాల్సి ఉందన్నారు. ఈ ప్రీమియం చెల్లించకపోవడంతో 7,606 మంది రైతులు నష్టపోతున్నారని తెలిపారు. వీళ్లందరూ కుటుంబ పెద్దను కోల్పోయిన అనంతరం ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎదురు చూస్తున్నారన్నారు. పంట నష్టపోయి, అప్పులపాలై రైతులే బాధపడుతున్నారని, కనీసం రైతుకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. రైతు బీమా పథకం అనేది ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తూ భరోసా కల్పించాల్సి ఉంటుందన్నారు. ఈ పథకాన్ని ఏ పార్టీ మొదలు పెట్టినా దానిని ఎలా ముందుకు తీసుకుని వెళ్తున్నామనేది మాత్రమే ముఖ్యమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి రైతు బీమా పథకానికి సంబంధించి ఎల్ఐసీకి చెల్లించాల్సిన రూ.442 కోట్ల ప్రీమియం చెల్లించి 7,606 మంది రైతు కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.

kamareddy 4

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదు: కేటీఆర్ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *