SIR Mapping Process | పట్టణ ప్రాంతాల్లో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి : సీఈవో

Shashi kiran Mottala
SIR Mapping Process | పట్టణ ప్రాంతాల్లో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: SIR Mapping Process | పట్టణ ప్రాంతాల్లో ఎస్​ఐఆర్ మ్యాపింగ్ (SIR mapping) ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ మ్యాపింగ్ ప్రక్రియపై సోమవారం హైదరాబాద్ (Hyderabad)​ నుంచి ముఖ్య ఎన్నికల అధికారి (election commission India) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్షించారు.

SIR Mapping Process | తెలంగాణలో వేగవంతం చేయాలి..

ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. కొన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ మ్యాపింగ్ 95 శాతానికి పైగా జరిగిందని, తెలంగాణలోనూ(Telangana elections) వేగవంతం చేయాల్సి ఉందన్నారు. ఈఆర్​వోలు, ఏఈఆర్వోలు మ్యాపింగ్ ప్రక్రియ విషయంలో సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు, సూపర్​వైజర్లకు దిశానిర్దేశం చేస్తూ ఉండాలన్నారు.

బూత్ స్థాయిలో ఆయా రాజకీయ పార్టీల ఏజెంట్ల నియామకానికి సంబంధించి ఇప్పటికే పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించినందున వారి సహకారం తీసుకోవాలన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పరిధిలోని బీఎల్​వోలతో స్వయంగా మ్యాపింగ్ చేయించుకునేందుకు ఆసక్తి చూపితే మిగిలిన వారి మ్యాపింగ్ చేసేందుకు సులభతరమవుతుందని అన్నారు.

SIR Mapping Process | నిజామాబాద్​ జిల్లాలో..

కాగా.. నిజామాబాద్ జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిలో ఉందని అన్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ (Nizamabad Municipal Corporation) పరిధిలో వివిధ కారణాల వల్ల కొంత వెనుకబడి ఉందన్నారు. అర్బన్​లో 44.78 శాతం మ్యాపింగ్ జరిగిందని, ఈ ప్రక్రియపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి వారం పది రోజుల వ్యవధిలో 70 శాతం వరకు మ్యాపింగ్ పూర్తి చేయిస్తామని తెలిపారు.

ఎస్ఐఆర్ మ్యాపింగ్ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపడతామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్​లో ఆర్డీవో రాజేంద్ర కుమార్, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, విజయేందర్ తదితరులు పాల్గొన్నారు.

54

ఇది కూడా చదవండి:Medigadda Barrage | మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *