అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad Chemists | ది నిజామాబాద్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్ట Yellammagutta కార్యాలయంలో ప్రశాంతంగా నిర్వహించారు. సభ్యులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు VOTE హక్కును వినియోగించుకున్నారు.
Nizamabad Chemists | అధ్యక్షుడిగా సంతోష్..
ఈ ఎన్నికల్లో మొత్తం 317 ఓట్లు పోలైనట్లు ఎన్నికల నిర్వాహకులు తెలిపారు. ఓట్ల లెక్కింపు అనంతరం కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షుడిగా మైసరి సంతోష్, కార్యదర్శిగా మాదాసు మల్లేష్, కోశాధికారిగా బేతు గంగాధర్ విజయం సాధించారు.
Unemployment Safety Net | ఉద్యోగి రక్షణలో భారత్ వెనుకబడి ఉంది : కేంద్రంపై కవిత విమర్శలు!
నూతనంగా ఎన్నికైన పదాధికారులకు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. సంఘ అభివృద్ధి, కెమిస్టులు మరియు డ్రగ్గిస్టుల సమస్యల పరిష్కారం కోసం సమష్టిగా పనిచేస్తామని నూతన కార్యవర్గం సభ్యులు పేర్కొన్నారు. ఎన్నికైన నాయకులను ఈ సందర్భంగా సంఘ సభ్యులు అభినందిస్తూ, పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు.