అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Police Image | పోలీస్ ఇమేజ్ను పెంచేవిధంగా సిబ్బంది వ్యవహరించాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు. మెండోరా పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Police Image | క్షుణ్ణంగా రికార్డుల పరిశీలన..
ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను సీపీ క్షుణ్ణంగా పరిశీలించారు. అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలని సబ్ ఇన్స్పెక్టర్కు సూచనలు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాల జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు, కళాశాలలో, సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలలో విలేజ్ పోలీస్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తున్న పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరించి గ్రామాల్లో సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

ఈ పోలీస్ స్టేషన్ సరిహద్దులో నిర్మల్, మెట్పల్లి ఉన్నందున వాహనాల రాకపోకలపై ఎల్లప్పుడూ నిఘా ఉంచాలన్నారు. ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించారు. అధికారులు,సిబ్బంది 24 గంటలు తమ హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని, దూర ప్రాంతాల నుంచి ప్రయాణాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. సిబ్బంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమ హెల్త్ చెకప్ చేయించుకోవాలని, ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ట్రాఫిక్ రూల్స్‌ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, మెండోరా ఎస్సై సుహాసిని, సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Ganja Seizure | నగరంలో గంజాయి కలకలం.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు