అక్షరటుడే వెబ్‌డెస్క్: Prashanti Express Robbery | తుని – అనకాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణికులను కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగుళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో( Prashanti Express ) ఈ దారుణం చోటుచేసుకుంది.
Prashanti Express Robbery | సుమారు రూ. 30 వేల నగదు..
గురువారం ఉదయం బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ తుని స్టేషన్ దాటింది. రైలు జనరల్ బోగీలో ఉన్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకున్న నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు, ఒక్కసారిగా కత్తులు బయటకు తీసి బెదిరించారు. ప్రాణ భయంతో ఉన్న ఆరుగురు ప్రయాణికుల వద్ద ఉన్న సుమారు రూ. 30 వేల నగదును, మూడు సెల్‌ఫోన్లను లాగేసుకున్నారు. అనకాపల్లి స్టేషన్ రాగానే దుండగులు రైలు దిగి పరారయ్యారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన బాధితులు 139 నంబర్‌కు కాల్ చేసి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. బాధితులంతా ఒడిశాకు చెందినవారిగా గుర్తించారు. నిందితుల కోసం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

Prashanti Express Robbery | విజయవాడకు చెందిన ముఠాగా అనుమానం..
ప్రాథమిక విచారణలో భాగంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దోపిడీకి పాల్పడిన నిందితులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారుగా తెలుస్తోంది. వీరు విజయవాడ నుండి రైలులో వచ్చి అన్నవరం వద్ద ఎక్కి, తుని దాటాక దోపిడీకి ప్లాన్ చేశారు. నిందితులను పట్టుకునేందుకు రైల్వే స్టేషన్లలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, పాత నేరస్థుల వివరాల ఆధారంగా గాలింపు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Nizamabad Ganja Seizure | నగరంలో గంజాయి కలకలం.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు