Nara Lokesh | ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క: మంత్రి లోకేశ్

Srinivas Kolluri

అక్షరటుడే, విశాఖపట్నం: Nara Lokesh | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఐటీ రంగ చరిత్రలో విశాఖ నగరం అంతర్జాతీయ స్థాయికి చేరిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మంగళవారం విశాఖ జిల్లా (Visakhapatnam District) తర్లువాడలో ప్రతిష్ఠాత్మక గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.

Nara Lokesh | చారిత్రాత్మక ఘట్టము:

ఈ భూమి పూజ కేవలం ఒక భవన నిర్మాణానికి సంబంధించింది కాదని, ఏపీ అభివృద్ధిలో ఇదొక చారిత్రాత్మక ఘట్టమని లోకేశ్ అభివర్ణించారు. “ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క.. ఇకపై గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో విశాఖ పేరు మారుమోగుతుంది. వైజాగ్ అంటే ఇకపై గూగుల్ అనే శబ్దం వినిపిస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

Nara Lokesh | 2019 ముందే చర్చలు:

ఈ ప్రాజెక్టు నేపథ్యాన్ని వివరిస్తూ.. 2019కి ముందే దీనికి సంబంధించిన చర్చలు జరిగాయని, నాటి ఆలోచన నేడు కార్యరూపం దాల్చడం సంతోషంగా ఉందని తెలిపారు. గత ఐదేళ్ల పాలనలో విధ్వంసం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడిన పరిస్థితిని చూశామని, కానీ 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మళ్ళీ మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు.

Nara Lokesh | ఏపీ సరికొత్త రికార్డులు:

చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని లోకేశ్ అన్నారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మంత్రంతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో (డబుల్ ఇంజిన్ సర్కార్) ఏపీ సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Chittoor journalist murder | చిత్తూరు జిల్లాలో జర్నలిస్ట్ హత్య.. మార్నింగ్ వాక్ స‌మ‌యంలో దాడి, ప్రధాన నిందితుడి గుర్తింపు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *