Hyderabad Hailstorm | కాశ్మీర్ కాదు హైదరాబాద్.. ఓఆర్​ఆర్​పై మంచు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Hailstorm | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో సైతం వేడి తీవ్రత అధికంగా ఉంది. చల్లటి ఐస్​ గడ్డను బయట పెడితే నిమిషాల్లోనే కరిగిపోతుంది. అలాంటి నగరంలో కశ్మీర్​ను తలపించేలా మంచు కురిసింది. మీటర ఎత్తులో వంద మీటర్ల మేర కురిసిన వడగాళ్లు మంచు రాశులను తలపించాయి. ఈ ఘటన సోమవారం సాయంత్రం నగరంలోని ఓఆర్​ఆర్​పై చోటు చేసుకుంది.

నగరంలో సోమవారం సాయంత్రం వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వడగళ్లు సైతం పడ్డాయి. శంషాబాద్-నాదర్ గుల్ (Shamshabad–Nadargul) మధ్య ఔటర్​ రింగ్​రోడ్డుపై కిలోమీటర్ల మేర మంచు పేరుకుపోయినట్లు వడగళ్లు కురిశాయి. హైదరాబాద్ నగరంలో మంచును చూడటంతో వాహనదారులు షాక్​ అయ్యారు. రోడ్డు పక్కన తమ వాహనాలను నిలిపి మంచులో ఎంజాయి చేశారు. ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ హిమాలయాలను తలపిస్తోందంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Hyderabad Hailstorm | ఎందుకిలా..

రాష్ట్రంలో భిన్న వాతావరణం ఉంటుంది. సాయంత్రం వరకు ఎండ దంచి కొడుతోంది. సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతోంది. అకాల వర్షాలు కురుస్తున్నాయి. వడగళ్లు సైతం పడుతున్నాయి. క్యుములోనింబస్ (Cumulonimbus)​ మేఘాల కారణంగా నగరంలో భారీగా వడగళ్లు పడ్డట్లు అధికారులు పేర్కొన్నారు.

Hyderabad Hailstorm | నేడు వర్ష సూచన

నేడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నల్గొండ, యాదాద్రి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, గద్వాల్, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగళ్లతో కూడిన బలమైన వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఒక మోస్తరు నుండి తీవ్రమైన ఉరుములతో కూడిన వడగళ్ల వాన పడుతుంది.

ఇది కూడా చదవండి..: Hyderabad Women Safety | సోలార్ సైకిల్ ట్రాక్​పై మహిళపై అసభ్య ప్రవర్తన.. భద్రత ఎక్కడంటూ బాధిత ప్రశ్నలు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *