అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Volatility | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) స్వల్ప ఒడిదుడుకులకు లోనవుతోంది. నష్టాలతో ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు.. భారీ నష్టాల దిశగా సాగుతున్నట్లు కనిపించినా తర్వాత కోలుకున్నాయి.
మంగళవారం ఉదయం సెన్సెక్స్ 209 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 121 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో 520 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 50 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని 182 పాయింట్లు లాభపడింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 222 పాయింట్ల నష్టంతో 77,081 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 24,060 వద్ద ఉన్నాయి.
Stock Market Volatility | బ్యాంకింగ్ సెక్టార్ పై ఒత్తిడి..
బ్యాంకింగ్ స్టాక్స్ ఒత్తిడికి గురవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 0.88 శాతం, ఐటీ 0.44 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.36 శాతం నష్టాలతో సాగుతుండగా.. నిఫ్టీ టెలికాం ఇండెక్స్ 1.56 శాతం, ఎనర్జీ 1.31 శాతం, మెటల్ 1.01 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.97 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 12 స్టాక్స్ లాభాలతో, 18 స్టాక్ట్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్ 1.41 శాతం, సన్‌ఫార్మా 1.22 శాతం, ఎయిర్ టెల్ 1.00 శాతం, కొటక్ బ్యాంక్ 0.92 శాతం, టీసీఎస్ 0.67 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎటర్నల్ 3.40 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.25 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.77 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.74 శాతం, ఇండిగో 1.57 శాతం నష్టంతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: April 28 Gold Prices | తగ్గుముఖం పడుతున్న పసిడి ధర.. దేశవ్యాప్తంగా నేటి పరిస్థితి ఏమిటంటే!


[…] ఇది కూడా చదవండి..: Stock Market Volatility | ఒడిదుడుకుల్లో స్టాక్ మార్క… […]