CMR Green IPO | ఐపీవోకు భారీ డిమాండ్.. 127 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిన ‘సీఎంఆర్’

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: CMR Green IPO | మార్కెట్ అనిశ్చితుల కారణంగా స్తబ్ధుగా ఉన్న ప్రైమరీ మార్కెట్‌లోకి చాలా కాలం తర్వాత మెయిన్‌బోర్డు కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. దీనికి అనూహ్య స్పందన లభించింది. రిటైల్ ఇన్వెస్టర్లతోపాటు ఎనఐఐలు, క్యూఐబీలు కూడా భారీగా బిడ్లు దాఖలు చేశారు.

CMR Green IPO | రూ. 631 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యం..

CMR Green IPO

ప్రైమరీ మార్కెట్ నుంచి రూ. 631 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వాటాదారులు రూ. 2 ముఖవిలువ కలిగిన 3,28,58,323 షేర్లను విక్రయించారు. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 192 గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 78 షేర్లున్నాయి. ఈనెల 3న ప్రారంభమైన సబ్‌స్క్రిప్షన్ గడువు 5వ తేదీ సాయంత్రం 5 గంటలతో ముగిసింది.

CMR Green IPO | ఆఫర్ ఫర్ సేలే అయినా..

సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ ద్వారానే రూ 631 కోట్లు సమీకరించడం కోసం ఐపీవో (IPO)కు వచ్చింది. అంటే ఈ ఇష్యూ ద్వారా కంపెనీకి ఒక్క రూపాయి కూడా ఆదాయం సమకూరదు. వాటాదారుల ఖాతాలోనే డబ్బులు వెళ్లాయి. అయినా ఈ బిడ్లు దాఖలు వేయడం కోసం ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. దీంతో మొత్తం 126.88 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది.

విభాగాలవారీగా : క్యూఐబీ కోటా 270.46 రెట్లు, ఎనఐఐ కోటా 172.24 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 25.76 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది.

CMR Green IPO | భారీగా పెరిగిన జీఎంపీ..

CMR Green IPO

ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో రోజురోజుకు డిమాండ్ పెరుగుతూ రావడంతో ఇన్వెస్టర్ల బిడ్లు వేయడానికి ఆసక్తి చూపారు. గతనెల 28న జీఎంపీ సున్నాగా ఉండగా.. 29న రూ. 25 రూపాయలు ఉంది. 30న రూ. 35కు పెరిగింది. క్రమంగా పెరుగుతూ వస్తోంది. శుక్రవారం సాయంత్రానికి జీఎంపీ రూ. 77 గా ఉంది. అంటే ఐపీవో అలాట్ అయితే లిస్టింగ్ రోజే సుమారు 40 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కంపెనీ షేర్లు 10వ తేదీన బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టవుతాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Losses | ప్రారంభ లాభాలు ఆవిరి.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *