Swiggy Food Safety | ఆహార భద్రత కోసం స్విగ్గీ ప్రత్యేక హెల్ప్‌లైన్.. 24×7 అందుబాటులో సేవలు

ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రముఖ ఆన్-డిమాండ్ ప్లాట్‌ఫామ్ 'స్విగ్గీ' కీలక నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Swiggy Food Safety | ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రముఖ ఆన్-డిమాండ్ ప్లాట్‌ఫామ్ ‘స్విగ్గీ’  ( Swiggy )కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల నుంచి వచ్చే ఫుడ్ సేఫ్టీ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేకంగా 24×7 హెల్ప్‌లైన్‌తో పాటు యాప్‌లో మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఏవైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే నేరుగా 7948231850 నంబర్‌కు కాల్ చేసి కస్టమర్ కేర్ ఏజెంట్ల ద్వారా తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చు.

Swiggy Food Safety | ప్రత్యేక ‘ఫుడ్ సేఫ్టీ’ ఛానెల్..

ఫోన్ కాల్‌తో పాటు యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే సౌలభ్యాన్ని స్విగ్గీ కల్పించింది. స్విగ్గీ యాప్‌లోని హెల్ప్ సెక్షన్‌లో ప్రత్యేకంగా ‘ఫుడ్ సేఫ్టీ’ ఛానెల్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా కస్టమర్లు తమ సమస్యను చిన్న సందేశం రూపంలో టైప్ చేసి, సంబంధిత ఫొటోలను కూడా అప్‌లోడ్ చేయవచ్చు. ఫిర్యాదు నమోదు కాగానే వినియోగదారుడికి ఒక టికెట్ నంబర్ లభిస్తుంది, దీని ద్వారా ఫిర్యాదు స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు.

మరోవైపు, హెల్ప్‌లైన్‌కు కాల్ చేసే కస్టమర్ల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ప్రత్యేక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా ఫొటోలు లేదా అదనపు సమాచారాన్ని షేర్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఇలా వచ్చే ఫిర్యాదులను ‘స్విగ్గీ ఫుడ్ సేఫ్టీ అస్యూరెన్స్ టీమ్’ అత్యంత ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి తక్షణ చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది.

Swiggy Food Safety | నాణ్యతకు పెద్దపీట..

ఈ కొత్త సదుపాయాలపై స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సిద్ధార్థ్ భకూ స్పందిస్తూ.. రెస్టారెంట్ భాగస్వాములతో కలిసి పనిచేయడంతో పాటు, కస్టమర్ల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా లోపాలు తలెత్తితే త్వరగా గుర్తించి సరిదిద్దేందుకు ఈ కొత్త టచ్ పాయింట్లు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. రెస్టారెంట్లలో నాణ్యమైన పదార్థాల వాడకం, పరిశుభ్రతా ప్రమాణాలు పాటించేలా భాగస్వాములకు నిరంతరం అవగాహన కల్పిస్తున్నట్లు స్విగ్గీ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి:  CP Radhakrishnan | తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరుకానున్న ఉప రాష్ట్రపతి

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *