KCR Comments | బూతుల వీరుడితో చర్చకు రమ్మంటున్నారు.. రేవంత్‌పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: KCR Comments | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో జరిగిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష (BRSLP) సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వెయ్యి రోజులు పూర్తయినా పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నకిరేకల్ సభలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) చేసిన విమర్శలకు కేసీఆర్ ఈ సమావేశంలో దీటుగా స్పందించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు పార్టీ సభ్యులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని పిలుపునిచ్చారు.

KCR Comments | చిల్లర రాజకీయాలు ..

పరిపాలన చేతకాకనే సీఎం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తూ బూతు మాటలు మాట్లాడుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలన థర్డ్ క్లాస్ మాదిరిగా ఉందని ప్రజలే చర్చించుకుంటున్నారన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని ముందే తెలిసి, ఇష్టానుసారంగా దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. బూతుల వీరుడితో చర్చకు అసెంబ్లీకి రమ్మంటున్నారని, తన మరణాన్ని కోరుతూ పదేపదే మాట్లాడటం ఎంతవరకు సమంజసమని కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధి కుంటుపడిందని, ఇది తెలంగాణ ప్రగతి కాదని కేవలం పతనమని (డౌన్‌ఫాల్) ఆయన ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి:  Delhi Hostel Collapse | ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్​.. శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *