Shabad Killer Case | షాబాద్​ కిల్లర్​ను రేవంత్​ సన్నిహితుడు కాపాడాడు.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి హయాంలో ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shabad Killer Case | రేవంత్ రెడ్డి హయాంలో ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) అన్నారు. షాబాద్ కిల్లర్‌ను రేవంత్ సన్నిహితుడే పోక్సో కేసు నుంచి కాపాడారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ఓ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రూ.20 లక్షలు లంచం తీసుకొని పోక్సో కేసులో రాజ్​కుమార్​కు బెయిల్ వచ్చేలా చేశారని హరీశ్​రావు అన్నారు. పోలీసులు అతడితో కలిసి మద్యం తాగారని ఆరోపించారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా 45 రోజులు టైమ్ ఇస్తే, నిందితుడు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకొని ఆరుగురిని హత్య చేశాడన్నారు. ఏపీలో వైసీపీ స్పోక్స్‌పర్సన్ నాగార్జున యాదవ్, రేవంత్ రెడ్డి పెయింట్ వేస్తాడు అంటే ఆయనను అరెస్ట్ చేశారని, నల్లబాలు ట్వీట్ చేస్తే అరెస్ట్ చేశారని విమర్శించారు. కానీ పోక్సో కేసులో నిందితుడు రాజ్ కుమార్‌ను అరెస్ట్ చేయకుండా, వాడితో కూర్చొని పోలీసులు మందు తాగారన్నారు.

Shabad Killer Case | డీజీపీ ఎం చేస్తున్నారు

రేవంత్ రెడ్డి కోస్తా, రక్తం తీస్తా అని అంటుంటే డీజీపీ చెప్పిన ఖాకీ బుక్ ఏం చేస్తుందని హరీశ్​రావు ప్రశ్నించారు. హింసను ప్రేరేపిస్తే, క్రిమినల్ మాటలు మాట్లాడితే కేసులు నమోదు చేయాలి కదా అన్నారు. తనను కోసిన పైసలు లేవు అంటున్న సీఎం.. లక్ష కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ ఎలా కడుతున్నారన్నారు. రైతుబంధు వేస్తే ఎకరానికి ఒక సభ పెడుతాడని విమర్​శించారు. ఖమ్మంలో రైతుబంధు కోసం సభ పెట్టి 3000 బస్సులు పెట్టారని, దాదాపు 100 కోట్లు ఖర్చు చేశారన్నారు.

ఇది కూడా చదవండి..: Singareni Bharosa Yatra | గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే భారీ బొగ్గు కుంభకోణం: కిషన్ రెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *