TG RERA | రెరా ఛైర్మన్​గా శ్రీనివాసరాజు నియామకం

తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ నియంత్రణ అథారిటీ (టీజీ-రెరా) ఛైర్మన్​గా శ్రీనివాసరాజును ప్రభుత్వం నియమించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TG RERA | తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ నియంత్రణ అథారిటీ (టీజీ-రెరా) ఛైర్మన్​గా శ్రీనివాసరాజు నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేశ్​ రంజన్ (Jayesh Ranjan)​ ఉత్తర్వులు జారీ చేశారు.

రియల్ ఎస్టేట్ (నియంత్రణ, అభివృద్ధి) చట్టం– 2016లోని సెక్షన్ 22, తెలంగాణ రియల్ ఎస్టేట్ (నియంత్రణ అభివృద్ధి) నియమావళి 2017లోని నియమం 17 ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ప్రభుత్వం రిటైర్డ్​ ఐఏఎస్ అధికారి కె.ఎస్. శ్రీనివాస రాజును రెరా ఛైర్మన్​గా నియమించింది.

TG RERA | మెట్రో అడిషనల్​ ఎండీగా అజిత్​రెడ్డి

hyderabad metro 1

హైదరాబాద్ మెట్రో రైలు (Metro Rail) లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్‌గా బి. అజిత్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్వెస్ట్ తెలంగాణ, ఐ&సీ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్​గా కొనసాగుతున్న అజిత్ రెడ్డిని హైదరాబాద్ మెట్రో అదనపు ఎండీ(ఎఫ్​ఏసీ)గా నియమించారు.

దీనిని కూడా చదవండి : Panchayat Secretary Bribery | ఇంటి అనుమతి కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *